November 01-15, 2018

పాఠ్యాంశం

సీ…ముసురు సీకటి…సీకటి ముసురు…ముసురు… సీముసురు… మూత పెట్టి కప్పీసిన గంగాళం నాగుంది…భూగోళం సీకటి సీకటిగ.        ప్రెపంచంలోని మనుషులే కాదు జీవజాలమంతా కలిసి కారస్తన్న కన్నీళ్ల లాగ ఆకాశిం ధారగా కురస్తంది! ముసురు ముసురు...

ప్రపంచాన్ని కుదిపేస్తున్న స్త్రీల వుద్యమం: “మీ టూ”

(పైన వున్న ఫొటో: “మీ టూ” ఉద్యమ కారిణీ తరన బర్క్) జడ్జ్ కావినాను సుప్రీం కోర్టు  జస్టీస్ గా నియమించడానికి నిరసనగా…. మహిళల నిరసన మరొక అపూర్వ ఘటన. అమెరికా సుప్రీం కోర్టు ఆవరణలో నిరసనకారులు కనిపిస్తే చాలు అరెస్టులు సాగుతాయి...

బయం లేని చిన్ని జాన్

అనగనగా ఒక పిల్లవాడుండే వాడు. తన పేరే బయం లేని చిన్ని జాన్. ఎందుకంటే తనకసలు బయమే లేదు. తనకు ఏదన్నా బయం లేదు. చిన్ని జాన్ ఒక సారి దేశాటన చేస్తూ చేస్తూ ఒక పూటకూళ్ళ యింటి వద్దకు వెళ్ళాడు. రాత్రికి అక్కడ వుండొచ్చా అని అడిగాడు. ‘ఇక్కడ గదులు లేవు’...

మోహ సహవాస రాత్రి! వెళ్ళనీదు, ఉండనీదు !

  మొన్నీమధ్య Rx 100 అని ఒక సినిమా రిలీజయింది. హీరో హీరోయిన్లు కొత్తవాళ్లు. సినీమా భలే గా ఉంది. జంకు జంకుగా ఉండే కుర్ర హీరోని చాలా అందంగా ఉన్న హీరోయిన్ తన గుండెల పై పైకి లాక్కుని ముద్దులు పెట్టే సీన్లు చాలా రొమాంటిగ్గా ఉంటాయి. పెళ్ళై పిల్లలున్న...

ఒక దెయ్యాలు…

ఈ పెద్దాళ్ళున్నారే… ఒక దెయ్యాలు… -బమ్మిడి జగదీశ్వరరావు మా మంచి నేస్తాలూ... ఒకసారి ఏమయిందంటే- ఒకసారేంటి, చాలా సార్లు అదే అయ్యింది. ఏమయిందా? మా చిట్టి చెల్లి చిన్నది. పొన్నది. బంగారు కన్నది. దానికి చీకంటంటే భయం… ఆమాటకొస్తే చీకటంటే మా...

పెట్టుబడి నాటకం బయట పెట్టిన బ్రెఖ్ట్

  ‘తినే రొట్టె నెలా కాల్చాలో న్యాయమనే రొట్టెనీ ప్రజలే కాల్చాలి తాజాగా, మొత్తంగా, రోజూ –   (బ్రెఖ్ట్, ద బ్రెడ్ ఆఫ్ ది పీపుల్ కవిత) కదా-న్యాయ మందరికీ సమానంకదా? కానీ పెట్టుబడిదారీ సమాజం లో న్యాయం అలా వుండదు.అది ధనికులకే అందుబాటులో వుంటుంది...

కన్నీటి ముత్యాలు కష్టాల రత్నాలు: రాసీమ!

కర్నూలు, కడప,చిత్తూరు, అనంతపురం అనే నాలుగు జిల్లాల సమూహం రాయలసీమ. 1800 సంవత్సరంలో బళ్లారితో కలిపి ఐదు జిల్లాలను నిజాం నవాబు బ్రిటిష్ వారికి దత్తత ఇవ్వడంతో దత్త మండలాలుగా పేరొందింది.1928 లో కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో చిలుకూరి...

గుండెను పిండేసే చిత్రం ‘హార్ట్ అఫ్ ది సన్’

  మాతృత్వం ఒక తియ్యటి కల. తన శరీరం లోంచి మరో చిన్ని శరీరానికి జన్మనిచ్చి, ఆ నవజాత కళ్ళల్లో మెరుపు చూసి కళ్ళు చెమ్మగిల్లే మాతృమూర్తి అనుభూతి వర్ణనాతీతం. అటువంటిది తనకిక సంతాన యోగమే లేదనీ, అది కూడా తన శారీరక లోపం వల్ల కాదనీ, తనకు తెలీకుండా తన...

లెక్క తప్పింది!

వాడు పెగ్గు తర్వాత పెగ్గు తాగుతాడు తాగి ఊయలలూగుతాడు ఊగి నేలపై పొర్లుతాడు వాడికి పగలూ రాత్రీ తేడా లేదు ఆమెకు మనసు మనసులో ఉండదు ఫోన్ చేస్తుంది మాట్లాడేది వాడు కాదు వాడి ఆనుపానులు ఎవరో చెబుతారు ఆమె బలవంతాన అలల్ని కంట్లోనే నిలిపి అతడి కోసం వెళ్తుంది...

క్రూరమైన పట్టనితనమంటే ఏమిటి?

జి.రఘురాం, విజయవాడ ప్రశ్న 1: మార్క్సిజం గురించి నాకు నిజంగా తెలియదు. ఏమీ చదవలేదు. కానీ, సమాజంలో, పేదా – ధనికా తేడాలు వుండడం చూస్తున్నాను. వాటికి, కారణాలు వున్నాయి అని విన్నాను. మనుషుల జీవితాలు సమానం అయ్యే మార్పు నిజంగా సాధ్యం అంటారా? తేలిగ్గా...

‘మర్మ’ సంభాషణ

బాల్యం గుర్రం ఎక్కి ఊగే పసిదనం పద్యాన్ని ఆకాశం నదిలో కదిలే దూదిమబ్బుల చేపపిల్లలను పట్టుకొని బుట్టలో వెయ్యాలనుకునే అమాయకత్వాన్ని గాలి ఉయ్యాలలో తూనీగల రెక్కలమీద ఎగిరే చంచల బాల్యాన్ని ఉరుకులు పెట్టే ఉడతలతో చెంగుచెంగున దూకే కుందేళ్ళతో కబుర్లు చెప్పే...

మునిగిపోతున్న సౌందర్యం: వెనిస్

ఉత్తర ఇటలీ లోని ఏడ్రియాటిక్ సముద్రం లోని వందకు మించి దీవులున్న  చిన్న నగరం వెనిస్. నగరం చిన్నదే కానీ దాని ప్రత్యేకత అపురూపం. చాలా మంది సాహితీవేత్తలు ” there is no city like Venice”  అంటారు. ” వెనిస్ గురించి మాట్లాడకండి ఎందుకంటే...

ఆమోదంలోనే ప్రమోదం

‘Don’t write him off yet; he is still alive’ అని ఒక నానుడి ఉంది. వాణ్ణి అప్పుడే తీసిపారేయద్దు; వాడింకా బతికే ఉన్నాడు అని అర్ధం. సాధారణంగా మనం చుట్టూ ఉన్నవాళ్ళని తీసిపారేస్తుంటాం. ఈ అవలక్షణం ఇంట్లోనే మొదలవుతుంది. తల్లిదండ్రులు ఒకరినొకరు మీ మొహం, నీ...

స్వప్నాక్షరాలు 

(శివలెంక రాజేశ్వరీ దేవి గురించి మరోసారి)  పశ్చిమ క్రిష్ణా జిల్లా , కృష్ణా నది ఒడ్డున చారిత్రాత్మక గ్రామం జగ్గయ్యపేట, ఎక్కడా సాహిత్య వాసనలు అంతగా తగలని  అప్పటి మారుమూల గ్రామం. అద్భుతం ఎప్పుడూ అంతే తన పని తాను చాలా సాదాసీదాగా చేసుకుంటూ పోతుంది , ఆ...

అబద్ధం

ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఒకే రాజకీయం, ఒకే అబద్దం. వొళ్లు అటు వూపి ఇటు వూపి, పెదిమల్ని బూరాల్లా చుట్టి ఒక నాయకుడు… జస్ట్ నిన్న తను నిస్సందేహంగా నుడివిన మాట అసలు ఎప్పుడూ అనలేదంటాడు మర్నాడు. ఆయన పేరు ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంపు. మరో సందర్భం లో...

సీమ క‌క్ష‌ల్లో కాసులేరుకునే యాపారులు!

  అదేందో గాని లోకం చాలా విచిత్ర‌మైంది. ఫ్యాక్ష‌నిస్టులంటే జ‌నం భ‌య‌ప‌డుతారు. ఇంత వ‌ర‌కే బాగానే ఉంది. మ‌రి ఇదే ఫ్యాక్ష‌న్ చేసే క్యారెక్ట‌ర్ మాత్రం సినిమాల్లో హీరో అవుతాడు. ఎంత మందిని చంపితే అంత పాలెగాడ‌ని జ‌నం ఒక‌టేమైన ఈలలు, చ‌ప్ప‌ట్లు...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.