September 16-30, 2019

తొలి వందరోజుల
చలనం సంచలనం!

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎక్కువ శాతం సంచలనాలే. అయితే వాటి వల్ల ఒనగూరబోయే ప్రయోజనాల పట్ల  ప్రజల అభిప్రాయాలు ఎలా ఉంటాయనేది ప్రధానం. గత నాలుగు నెలల ప్రభుత్వ పనితీరులో తీసుకున్న నిర్ణయాల్లో ప్రజల్లో ఎక్కువ  అలజడి...

నీరుగట్టు

మా అవ్వా తాతా నీరుగట్టు పనికి పోతుంటారు. శివరేతిరి  నెల పెట్టేసుండాది. అరకవ నీల్ల పూట. ఈపొద్దు వంతు మాది. మేము పిల్లోళ్లం సంగటి తినేసి పణుకోనుండాము. మాయవ్వ నాపక్కనే పణుకుని ఆమాట ఈమాటా చెబతా ఉండాది. తినేసి బయిటికి పొయుండిన తాత అప్పుడే ఇంట్లోకి వచ్చి...

అస్తిత్వవాద ఘర్షణకు
నిలువుటద్దం కాఫ్కా

జర్మన్ ల ప్రకారం యూదు, చెక్ ల ప్రకారం జర్మన్ అయిన ఫ్రాంజ్ కాఫ్కా 1883 జూలై 3న ప్రేగ్ నగరంలో మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. న్యాయవాద శాస్త్రాన్ని చదివి ఇన్సూరెన్స్ కంపెనీ లో ఉద్యోగం చేస్తూ విడి సమయంలో రచనలు చేశాడు. తన రచనలలో అస్తిత్వ సంఘర్షణను...

‘రూపా’యి

నా రూపం నాటి నుండి నేటి దాకా మారుతూనే మారకం లో వ్యత్యాసాలు విన్యాసాలు సగటుజీవి చేతిలో నేను అపురూపాయి నేనే బొమ్మా నేనే బొరుసు బిళ్ళని పిల్లల చేతుల్లో పెట్టుబడిదారుల చేతుల్లో అంగడిబొమ్మని మాంద్యం తరుముకొస్తుంటే వినియోగదారుడు బేలగా పెట్టుబడిదారుడు...

చొక్కా పాట

(విలియం హుడ్ (1799 మే 23 – !845 మే 3) ఆంగ్ల కవి, వ్యంగ్య రచయిత.  నిట్టూర్పుల వంతెన (బ్రిడ్జ్ అఫ్ సైస్), చొక్కాపాట (ది సాంగ్ అఫ్ ది షర్ట్) వంటి పద్యాల సుప్రసిద్ధులయ్యారు. అనారోగ్యం వల్ల 45 ఏట మరణించారు…)   పని…పని…పని...

నిష్ఫల నివేదన
Futile Lament

‘రస్తా’ మేరకు ఇది కుంచెం కొత్త ప్రయోగం. ఒక సమకాలీన తెలుగు కవి తాజా కవితను ఇంగ్లీషు చేసి ప్రచురించడం. ఒకరకంగా దీన్నొక వర్క్ షాప్ గా కూడా వాడుకుందాం. కవితను స్వయంగా కవే చేసినా సరే, మంచి అనువాదకునితో చేయించి పంపినా సరే. స్వయంగా చేసుకునే వారు తమ...

ఔను, ఒఖడే !

ఒక్కో కవిత్వం ఒక్కో రకంగా ఉంటుందెందుకని ? రకం అంటే, అది రాయబడ్డ విధానమనేనా ? లేదూ, దాని లక్ష్యం, గమ్యం అనుకోవచ్చునేమో. చెప్పదలుచుకున్న భావాన్ని ఏ రకంగా, ఏ వాహకాన్ని ధరింపజేసి ఆ కవిత్వ రూపాన్ని మనకి సాక్షాత్కరింపజేయవచ్చునో అది ఆయా కవులకి సులభసాధ్యమైన...

పంజాబ్ మెకానిక్

ఓ రోజు సాయంత్రం సన్నగా వాన మొదలైతే  శంకర్ విలాస్ లో కాఫీ తాగుదామని దూరాను. నా టేబుల్ ముందు కుర్చీ ఖాళీగా వుంది. ఓ సన్నగా పొట్టిగా  వున్న వ్యక్తి   హడావుడిగా వచ్చి కూర్చున్నాడు. బాగా నూనె రాసి జుట్టు వెనక్కి దువ్వి వున్నాడు. రుమాలు తీసి ముఖం...

ఒక విముక్తి విభిన్న కోణాలు

“విముక్త” పుస్తకం విభిన్న కోణాలలో సాగిన ఆసక్తికరమైన కథల సంపుటి. ఈ పుస్తకానికి ‘ఓల్గా’ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. నేటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లకు కట్టినట్టు చూపించడానికి రామాయణం లోని...

ఆధునిక మహిళ
వ్యక్తిత్వ వికాసం

‘సార్! చల్లా రామ ఫణిగారేనా మాట్లాడేది?’ ‘అవునండీ చెప్పండి.’ ‘నా పేరు స్వప్నజ. (పేరు మార్చాను). కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. మీ ఆర్టికల్స్ చదువుతుంటాను సార్. చాలా బాగుంటాయి. చిన్న సందేహం సార్! వ్యక్తిత్వ వికాస రచనలు కూడా మగవారికేనా...

ఒక బేబీ బ్లో అవుట్…

హాయండి… నేనండి… అండీ గాడి చెల్లెల్నండి! అదేనండి… ఇంతకు ముందు ‘ఒక ఫారిన్’ రాసిన ‘ఎక్స్’ గాడి చెల్లెలు ‘వై’నండి! ఔనండి… నాకింకా మాటలు కూడా పూర్తిగా రావండి! కూర్చోవడం నిల్చోవడం కొద్దిగా నడవడం వచ్చండి! పరిగెత్తి పడిపోవడం వచ్చండి...

నాటి పద్యానికి మేటి వారసుడు ‘కవి సమ్రాట్

గతం గర్భంలోకి పోయి శోధించి కొన్ని రత్నాలు ఏరుకుని నేటి సమాజపు విలువలకు అనుగుణంగా కావలసినంత వరకు మాత్రమే పొదిగి మాలికలు  గ్రుచ్చిన వారినే మనం అధికంగా చూశాం ఆధినిక సాహిత్య రంగంలో. కానీ నాటి రత్నాలనే తిరిగి శుభ్రం చేసి మరింత ప్రకాశమానం గావించి వాటి...

కంచికి చేరని కథ

కథ చెప్పడం అంటే అనగనగా అని మొదలు పెట్టడం కాదు. ఊ కొట్టించడం కాదు. ఊ కొట్టి నిద్రపోవడం కాదు. ఏడేడు సముద్రాలు దాటించడం కాదు. అన్ని కథలు కంచికి చేరుతాయా? కథ చదివాక పాదాల కింద సన్నటి సెగ తగలాలి. నరనరాన అగ్గి పుట్టాలి. రవ్వలు ఎగరాలి. అస్తవ్యస్త సమాజ...

కదలిక

‘మనిషి మరణిస్తాడు, మానవుడికి మరణం లేదు’ అంటాడు శ్రీశ్రీ. మానవుడు (హోమో సెపియన్స్) అనే స్పిసీస్ కు చావు లేదని కవి హృదయం. నిజానికి, ఈ స్పిసీస్ కూడా పెర్ఫెక్ట్ కాదు. ఇదీ అంతరించదగినదే. మరింత ఉన్నత జీవులకు చోటిచ్చి పోవలసినదే. గర్వం అక్కర్లేదు...

ఇలా పని చేస్తున్నాం!

మీరు గమనించారా?! 1. ‘రస్తా’లో పాత సంచికల్లోని ఫీఛర్లను తదుపరి సంచికలో అలాగే వుంచడం వుండదు. రచనల సంఖ్య తగ్గినా ఫరవా లేదు. అన్నీ తాజావే వుంటాయి. పాత సంచికల కోసం ఆ శీర్షిక మీద క్లిక్ చేసి, పాత సంచికల్లోకి వెళ్లొచ్చు. 2. ‘రస్తా’ సమయ పాలనకు కూడా...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.