సినిమా

మరో ‘వైరస్’ కథ!

కరోనాతో జగమంతా గజగజ వణుకుతోంది. దేశాలకు దేశాలు గృహనిర్భంధాల్లో ఉన్నాయి. అతి పెద్ద అణుశక్తి రాజ్యాలూ, కాబోయే ‘విశ్వగురు’వులూ ఈ మెడికల్ ఎమర్జెన్సీని తట్టుకోడానికి అగచాట్లు పడుతున్నాయి. అయితే సకాలంలో వైద్య సేవ అందితే కోవిద్-19 మరణాలు10 శాతానికి మించవు...

ధనస్వామ్యం రుగ్మతకు సినీ దర్పణం

‘పేరసైట్’ (గిసాంగ్‌చుంగ్) అనే దక్షిణ కొరియా సినిమా మొన్నటి 92 వ అకాడమీ అవార్డులలో పెద్ద సంచలనం సృష్టించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం – ఇలా ప్రముఖమైన  నాలుగు అవార్డులను గెలుచుకుంది...

యుద్ధం చిదిమేసిన ప్రేమ:
‘ది క్రేన్స్ ఆర్ ఫ్లయింగ్’ (1957)

“యుద్ధం వ్యయంతో కూడిన వ్యవహారం. అది చెల్లించే వాట్లోకెల్లా గరిష్టమైనది మానవ మూల్యమే.” – రోజ్ కెంప్. ప్రపంచాన్నే జయించాలనుకున్న జాత్యహంకారి ఫాసిస్ట్ నాజీ హిట్లర్ దురాక్రమణకు అడ్డుకట్ట వేయడానికి సోవియట్ రష్యా సైనికులూ, పౌరులూ కలిపి రెండు కోట్ల డబ్భై...

టోరీ బ్రిటన్ వాస్తవాన్ని చిత్రించిన
కెన్ లోచ్ సినిమాలు

“నా పేరు డేనియల్ బ్లేక్. నేను మనిషిని, కుక్కను కాదు. అందుకే, నేను నా హక్కులను అడుగుతున్నాను. మీరు నన్ను గౌరవంగా చూడాలని కోరుతున్నాను. నేను, డేనియల్ బ్లేక్ ను, ఒక పౌరుడిని, అంతకన్నా ఎక్కువ గానీ, తక్కువ గానీ కాను.’’ సుప్రసిద్ధ బ్రిటన్ దర్శకుడు కెన్...

‘ఇంటా – బయటా’ నాడూ, నేడూ!

రవీంద్రనాథ్ టాగోర్ నవల “ఘోరే బాయిరే’’ (ఇంటా, బయటా) 1916 లో ప్రచురితమైంది. ఈ నవల ప్రచురణకు కొన్ని సంవత్సరాల ముందు నుండే జాతీయత, దేశభక్తి గురించి ఆయన మనోభావాలు, ఆదర్శాలు సంఘర్షణ పడుతున్నాయి. దానికి ప్రత్యక్ష నిదర్శనం 1908 లో ఆయన ఒక స్నేహితుడికి...

ఒక తమిళ ‘జోకర్’ కథ

కొన్నిరోజుల క్రితం ఒక మిట్ట మధ్యాహ్నం కోల్ కతా బ్యారక్ పూర్ స్టేషన్ బయట ఒక ముసలాయన తనొక్కడే ఒక చేత కొన్ని కరపత్రాలు, మరో చేత హ్యాండ్ మైక్ పట్టుకుని కాశ్మీర్ సమస్య గురించి ఎదో వివరిస్తున్నాడు. జనాలెవరూ పట్టించుకోవడం లేదు. ఉండుండి ఇద్దరో ముగ్గురో...

అమెరికన్ సమాజానికి
అద్దం: జోకర్

.ప్రతీ సమాజంలో కొంత మంది ఉంటారు. వాళ్ళు ఎవరికీ ఏ ఇబ్బందీ కలిగించరు, కానీ అందరూ వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళకు వారి సొంత అస్తిత్వం గురించిన అవగాహన కూడా ఉండదు. ఈ ప్రపంచంలో తామూ బతుకుతున్నామనే స్పృహ ఉండదు. వాళ్ళు సమాజం నుంచి ఏదీ...

అణుదౌష్ట్యానికి సజీవ ఖండన
‘సిల్క్‌వుడ్’ బయోపిక్ (1983)

సినిమాల్లో బయోపిక్కుల హోరు సాగుతోందిప్పుడు. ఆయన చాయ్ అమ్మాడనీ, గుజరాత్ అల్లర్లు చూసి నిజంగానే తల్లడిల్లాడనీ సినిమా వచ్చింది. సినిమా అయితే హిట్టు కాలేదు గానీ రెండోసారి కూడా అయన సిక్సర్ కొట్టాడు. సిక్సర్ అంటే గుర్తొచ్చింది. మన దర్శకులు సచిన్, ధోనీల...

రానున్న ఫాసిజం ముందస్తు
హెచ్చరిక: ‘రామ్ కే నామ్’

ఆగస్ట్ 20, 2019. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సోషియాలజీ విభాగంలో ‘రామ్ కే నామ్’ (రాముని పేర) డాక్యుమెంటరీ ప్రదర్శన జరుగుతోంది. పోలీసులు దూసుకొచ్చారు. పర్మిషన్ లేకుండా వేస్తున్నారంటూ ఆరుగురిని అదుపులోకి(!) తీసుకున్నారు. పర్మిషన్ తీసుకున్నామని...

స్వతంత్ర భారతికి వెండి అద్దం ‘మదర్ ఇండియా’

‘మదర్ ఇండియా’ సినిమా 1957 అక్టోబర్ 25 న రిలీజ్ అయింది. ఇప్పటిదాకా భారతదేశంలో అతి ఎక్కువ రెవెన్యూ వసూలు చేసిన సినిమా ఇదేనని సినిమా పండితులు అంటున్నారు. ద్రవ్ద్యోల్బణంతో సరిచేసి నికరంగా చూస్తే, గా చూస్తే‌2017 లో వరకు 1.2 బిలియన్ రూపాయలుగా లెక్క కట్టి...

వెలుగు కోసం ఆరాటం!

ప్రజల అభిమతం మేరకు ఎంపికైన చిలీ దేశపు మొట్టమొదటి మార్క్సిస్ట్ అధ్యక్షుడు సాల్వడోర్ అల్లెండే. 1970 లో పాపులర్ యూనిటీ అనే ప్రజాస్వామ్య కూటమి తరుపు అధినేత అయ్యాడు. కానీ, అపారమైన సహజ వనరులున్న చిలీలో అమెరికా కార్పొరేట్లకు  స్వప్రయోజనాలున్నాయి. అల్లెండే...

బ్రాహ్మణవాద ద్వంద్వనీతిని ఎండగట్టిన “సంస్కార”(1970)

(గిరీష్ కర్నాడ్ స్మృతిలో….) పరిచయం అక్కర్లేని పేరు గిరీష్ కర్నాడ్. దీర్ఘ అనారోగ్యం తర్వాత గత నెల 10 వ తేదిన నిద్రలోనే నిష్క్రమించాడాయన. నాటకసినీరంగాల్లో రచయితగా, నటుడిగా, దర్శకుడిగా సుపరిచితుడు. యయాతి, తుగ్లక్, హయవాదన వంటి అతని నాటకాలు...

అమర ప్రేమకు చివరి పరీక్ష ‘అమోర్’

అది పారిస్ లోని ఒక ఎగువ మధ్యతరగతి అపార్ట్మెంట్ భవనం. ఒక అపార్ట్మెంట్ నుండి అసహజ దుర్వాసన వస్తోందన్న ఫిర్యాదు మేరకు అగ్నిమాపక సిబ్బందితో పోలీసులు కలిసి వచ్చి తలుపులు విరగ్గొట్టి సోదా చేస్తారు. పడక గది మంచం మీద  పువ్వులతో అందంగా అలంకరించిన ముసలావిడ...

‘ది ట్రూమాన్ షో’:
ఒక నిజమైన సెటైర్

ప్రస్తుత మన జీవితాల్లో..టీవీ సోషల్ మీడియా, ట్విట్టర్, సెల్ ఫోన్, సీక్రెట్ కెమెరాలు ఒక ప్రధానమైన భాగమైపోయాయి. ఇవి పెరిగిపోవటం వలన మనిషిలో కూడా రియాలిటీకి వర్చువాలిటీకి మధ్యన నిరంతర ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఫిక్షన్ vs, నాన్ ఫిక్షన్ లో స్థానంలో ఇపుడు...

నువ్వున్న ఇంటికి
టు లెట్ బోర్డు పెడితే…

ఇల్లు వెతికేటప్పుడు ‘tolet’ అని కనిపిస్తే చాలు ఎంతో ఆనందం. మరి అదే ‘tolet’ బోర్డు నీ ఇంటికే ఉంటే, ఆ పాటికి నీకింకో కిరాయిల్లు దొరక్కుంటే? మనం ఎప్పుడైనా పెళ్లి కార్డు ఇవ్వడానికో లేదా ఇంకేదైనా పని మీద చాలా రోజుల తర్వాత చుట్టం  ఇంటికి పోయేటప్పుడు...

తండ్రుల జాడకై పిల్లల అన్వేషణ: కాశ్మీర్

కాశ్మీరీ సామాన్యుడి జీవితాన్ని కన్నెత్తైనా చూడకుండా, కాశ్మీర్‌ సమస్యపై జాతీయ అవార్డు స్థాయి సినిమా ఎలా తీయవచ్చో నిరూపించాడొక దర్శకరత్నం. అందులో అగ్నిగుండం లాంటి సమస్యను ‘రోజా’ పువ్వంత సుకుమారంగా హ్యాండిల్‌ చేశాడు. సినిమాలోని ఆ రోజాకు టీ ఆఫర్‌ చేసే...

కొన్ని ఒంటరి నరకాలు

(రెక్విమ్ ఫర్ ఎ డ్రీమ్ – డ్రగ్స్ వర్సెస్ అబ్సెషన్స్) ప్రపంచానికి నీవు చేసేదంటూ ఏమీలేదు. నిజానికి ప్రపంచమే నిన్ను చేస్తుంది. నిన్ను నడిపిస్తుంది. నవ్విస్తుంది. ఏడిపిస్తుంది. అంతేనా?. అదును చూసి అది నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. ఏకాకిని చేసి...

భిన్నమైన అత్తా కోడళ్ళ కథ
‘ముఖర్జీ గారి భార్య’

కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక వీడియో కన్పించింది. ‘పెద్దయాక నువ్వేం చేస్తావ్?’ అని నాలుగేళ్ళ పాపను అడిగితే ‘పెద్దయితే పెళ్లి చేసుకుని అత్తను చంపేస్తా’ అని తడుముకోకుండా సమాధానమిస్తుంది ఆ పాప ఆ విడియోలో. చిన్న పిల్లలపై కూడా టీవీ సీరియళ్ళ...

కల్పన కన్న ‘చిత్ర’మైన వాస్తవాలకు
తాజా ఉదాహరణ?

Truth is stranger a than Fiction అంటాడు మార్క్ ట్వైన్. దీనిని ఆధారంగా చేసుకుని ఇపుడు సినిమాల్లోకి కొత్తగా వచ్చి చేరుతున్న జోనర్-  బయోపిక్. ప్రస్తుతం అటు హాలీవుడ్ లోనేకాక ఇటు బాలీవుడ్ లోనూ బయోపిక్ ల హవా నడుస్తోంది. దానికి తగ్గట్టుగానే  తెలుగు సినిమా...

ఎన్నికల ‘యుద్ధం’ ‘వ్యాగ్ ది డాగ్’ (1997)

దేశాధినేత ఐదేళ్ళు ఏలాడు. మళ్ళీ ఎన్నికలొచ్చాయి. రెండోసారి కూడా పోటీచేస్తున్నాడు. గెలవాలని ఉబలాట పడుతున్నాడు. టీవీలో ప్రచారాల జోరు ఇలా సాగుతోంది. గుర్రప్పందెంలో గెలిచిన అతడితో ఆమె: ఈ రోజు రేసు చాలా బాగా గెలిచావు. ఫైనల్స్‌లో కూడా ఈ గుర్రమేగా...

పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ – కాపిటలిస్ట్ కోణం

కొంతకాలం క్రితం పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు ఇబ్బడిముబ్బడిగా మార్కెట్లో దర్శనమిచ్చాయి. తెలుగు లో కూడా వీటి హల్చల్ కొంతకాలం కనబడింది. ఈ పుస్తకాలు గత వందేళ్ళుగా అమెరికన్ మార్కెట్ లో అడపదడపా కనిపిస్తున్నా 1970 నుండి మొదలుకొని 2000...

మధ్య తరగతి శల్యపరీక్ష ‘ఏక్‌ దిన్‌ ప్రతిదిన్‌’

‘ఏక్‌ దిన్‌’ అంటే ‘ఒకరోజు’, ‘ప్రతిదిన్‌’ అంటే ‘ప్రతిరోజు’. మొన్న, నిన్న, నేడు, రేపు, ఎల్లుండి విడివిడిగా అన్నీ ‘ఒకరోజు’లే. కలిపి చెబితే ‘ప్రతిరోజు’. ‘ప్రతిరోజు’లోని ‘ఒకానొక రోజు’కి ప్రత్యేకత వుంటే ఉండొచ్చు గాక, అయితే ఆ ‘ఒకరోజు’కి రోజుల ప్రవాహాన్ని...

మనస్సులను కొట్టేసే వెండితెర పిక్‍ పాకెట్‍

  ‘సమాజం పట్ల ద్వేషం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది చాలా మామూలు విషయం అయిపోయింది ఈమధ్య. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, పెద్దలు, పిల్లలు అందరూ సంఘాన్ని ద్వేషిస్తూ, తిట్టుకుంటూ సుఖంగానే ఉంటారు. అయితే, కొందరితో సమాజం పట్ల కోపం చాలా...

కుల వివక్ష మీద బలమైన బాణం

2018 మార్చి. గుజరాత్ లోని తింబి గ్రామంలో ప్రదీప్ రాథోడ్ అనే ఇరవై ఒక్క ఏళ్ల దళిత యువకుడ్ని అగ్రకులస్తులు ఘోరంగా హత్య చేశారు. గుర్రాన్ని పెంచుకోవడం అతడు చేసిన నేరం. 2018 ఏప్రిల్. రాజస్థాన్ భిల్వారా జిల్లాలో దళితుల పెళ్లి సందర్భంగా పెళ్లి కొడుకు గుర్రం...

వెండి తెర మీద “స్ప్రింగ్, సమ్మర్, ఫాల్, వింటర్ అండ్ స్ప్రింగ్”

పదేళ్ళ క్రితం 14 వ కోల్కతా ఫిల్మ్ ఫెస్టివల్ కిమ్ కి దుక్ అనే అసామాన్య దక్షిణ కొరియా దర్శకుడిని పరిచయం చేసింది. ‘ఆవిష్కరణ’ విభాగంలో చూపిన ఆయన తాజా సినిమాలను సినీ వీక్షకులు పసందైన విందులా ఆస్వాదించారు. స్లోగా సాగుతూనే మనసులో నిలిచేలా, సైలెంటుగా...

‘శివ’మెత్తిన కమర్షియలిజం!

కాలేజ్ కి వచ్చి చదువుకునే రోజులు ఎప్పుడో పోయాయి అంటాడు మల్లి పాత్రధారి. అదే మల్లి సినిమా కాసేపు ముందుకి జరిగాక “బాటనీ పాఠముంది మ్యాట్నీ ఆట వుంది సోదరా ఏది బెస్టురా అంటూ” క్లాసుల కంటే సినిమాలమీదే మక్కువ ఎక్కువని పాట పాడతాడు. శివ సినిమా...

గుండెను పిండేసే చిత్రం ‘హార్ట్ అఫ్ ది సన్’

  మాతృత్వం ఒక తియ్యటి కల. తన శరీరం లోంచి మరో చిన్ని శరీరానికి జన్మనిచ్చి, ఆ నవజాత కళ్ళల్లో మెరుపు చూసి కళ్ళు చెమ్మగిల్లే మాతృమూర్తి అనుభూతి వర్ణనాతీతం. అటువంటిది తనకిక సంతాన యోగమే లేదనీ, అది కూడా తన శారీరక లోపం వల్ల కాదనీ, తనకు తెలీకుండా తన...

సోలారిస్- ప్రేమకూ మానవత్వానికి ఓ మెటఫర్

అది 1979 సంవత్సరం. దేశ రాజధాని న్యూఢిల్లీలో Indian International film festival జరుగుతోంది. ప్రపంచంలోని అద్భుత చలన చిత్రాల ప్రదర్శన అని దేశం నలుమూలల నుంచి సినిమా పిచ్చివాళ్ళు చేరారు అక్కడికి. ఒక సినిమా తరువాత ఒక సినిమా ప్రదర్శితమౌతూ ఆహూతులను...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.