వాడిన వెంటనే అలా పారేసే పాలిథీన్ సంచులు, టన్నులకొద్దీ పోగుపడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలవల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికి అనర్థం తప్పదని నిపుణులు కొన్నేళ్లుగా హెచ్చరిస్తున్నారు. మునుపటి అంచనాల్ని మించి ప్లాస్టిక్ కాలుష్యం మానవాళిని ముంచెత్తనుందని తాజాగా శాస్త్రవేత్తలు ప్రమాదఘంటికలు మోగిస్తున్నారు.